యాలకుల తో ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో..?

యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. నోటి దుర్వాసనను తగ్గించడంలోనూ ఇవి బెస్ట్. మన ఇంట్లో వంటే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం. అన్ని వంటకాలకు ఇవి మంచి సువాసనను, రుచిని అందిస్తాయి. వీటిలో చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి. వీటికి చాలా చరిత్ర కూడా ఉంది.యాలకులు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని సినియోల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది పురుషుల్లో నరాలను బలపరచుతుంది. రోజూ చిటికెడు యాలకుల పొడి వాడితే సంతాన సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్ధ్యం తక్కువగా ఉన్నవారు రోజూ యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే యాలకులు వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే ఔషధ గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియను బలపరుస్తాయి. అలాగే కడుపులో మంట, నొప్పిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి. కొంతమంది బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. ఇలాంటి ఆలోచనల నుంచీ మనల్ని యాలకులు కాపాడగలవు. ప్రతి రోజూ యాలకుల టీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది.వాస్తవానికి, యాలకులులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,ఐరన్, పాస్పరస్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరానికి ఇవి చాలా మేలు చేస్తాయి.యాలకులను చాలా రకాలు తీసుకోవచ్చు. నేరుగా కూడా వాటిని తినేయవచ్చు. నోరు కూడా చాలా తాజాగా ఉంటుంది.

ప్రశాంతంగా నిద్రపోవడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. అలాగే  రాత్రి పడుకోవడానికి ముందు మూడు యాలకులను వేడి నీటిలో వేసుకొని మరగ పెట్టుుకొని.ఆ తర్వాత తాగాలి. ఇలా రాత్రి పూట తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది.రాత్రిపూట యాలకులు తింటే.నిద్రలో గురక సమస్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు గ్యాస్, ఎసిడిటీ, అరుగుదల, మలబద్ధకం లాంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.పురుషులు కచ్చితంగా రాత్రిపూట మూడు యాలకులు తినాలట. అలా తినడం వల్ల వారికి చాలా ప్రయోజనాలు చేకూరతాయట.వారిలోని చాలా సమ్యలకు ఇవి పరిష్కారం చూపిస్తాయి. నీరసాన్ని కూడా వెంటనే తగ్గిస్తాయి.పాలు, మంచినీటిలో  కలిపి యాలకులు తీసుకోవడం వల్ల శృంగార ఆసక్తితో పాటు  శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి వేసుకొని తాగితే  ప్రశాంతమైన నిద్రపట్టడంతోపాటు గురక సమస్య తగ్గుతుంది.శరీరంలో చేరిన క్యాన్సర్ కణాలను సైతం తగ్గించే సత్తా దీనికి ఉంది. ఓరల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ లపై ఇది పోరాడుతుంది. అలాగే  అధిక బరువు, ఒబేసిటీతో బాధపడుతున్న వారు కచ్చితంగా మీ డైట్ లో యాలకులు ఉండాలి. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *