మిస్టరీగా మిగిలిపోయిన ఒక దేశ ప్రధానమంత్రి కథ..?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎంతో మంది ప్రధాన మంత్రులు ఉన్నారు. ప్రధాన మంత్రులు కొంతమంది వారు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం ద్వారా ద్వారా ప్రసిద్ధి చెందారు. మరికొందరు కొన్ని కారణాల వల్ల ప్రసిద్ధి చెందారు. అయితే ప్రధానమంత్రి అంతే ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం అని అర్థం. అయితే  అంతా శక్తివంతమైన ప్రధానమంత్రికి ఏమి జరగకుండా అతని చుట్టూ ఎంతో మంది బాడీగార్డ్స్ ఉంటారు. అలాగే ప్రధానమంత్రి అంతే ఆయనకు జరిగే మర్యాదలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఒక దేశ ప్రధానమంత్రి అదృశ్యమై పోయాడు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రధానమంత్రి అదృశ్యమైన ఇంతవరకు ఆయన గురించి ఎటువంటి ఆచూకీ కనుగొనలేదు. అలాగే మరొక ప్రధాని పాకిస్తాన్ జుల్ఫీకర్ అలీ భుట్టో గురించి చూసుకుంటే ఈ ప్రధానమంత్రిని రాత్రి 2 గంటలకు ఉరితీశారు. అయితే మిస్టరీగా మిగిలిపోయిన ప్రధాన మంత్రి ఎవరు? ఏమిటి? ఎలా అదృశ్యమై పోయాడు? ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1908 ఆగష్టు 5న న్యూ సౌత్ వేల్స్‌లోని స్టాన్‌మోర్‌లో జన్మించిన  ఇద్దరు  హోల్ట్ సోదరులలో హెరాల్డ్ ఎడ్వర్డ్ పెద్దవాడు. అతని తల్లిదండ్రులు  హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ పుట్టడానికి ఏడు నెలల ముందు. జనవరి 1908లో వివాహం చేసుకున్నారు.ఆ తరువాత 1910లో అతని తమ్ముడు క్లిఫోర్డ్ హోల్ట్ జన్మించాడు.హెరాల్డ్ కి ఈత, చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. ఈయన 17 డిసెంబర్ 1967న, విక్టోరియా  చెవియోట్ బీచ్‌లో ఈత కొడుతున్నప్పుడు హాల్ట్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.అయితే అతని గురించి చాలా వెతికారు కానీ అతను ఎక్కడా కనిపించలేదు. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ అధికారికంగా డిసెంబర్ 20, 1967న మరణించినట్లు ప్రకటించారు, అయితే ఆయన మృతదేహం ఇప్పటి వరకు కనుగొనబడలేదు.  

అయితే హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ ఎవరు,ఆయన ప్రతేకత ఏమిటీ అని చూసుకుంటే..ఆస్ట్రేలియా 17వ ప్రధాన మంత్రి హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ 26 జనవరి 1966న ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని మెంజిస్ పదవీ విరమణ తర్వాత ఇతను పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆ సంవత్సరం తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా పాల్గొని ఘన విజయం సాధించాడు.హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్  అదృశ్యం గురించి చాలా విషయాలు జరిగాయి. కొందరు అతనిని షార్క్ తినేసిందని, మరికొందరు ఎవరో అతనిని హత్య చేసి ఉండొచ్చు అని ఊహగానాలు ముడిపెట్టారు. అలాగే  చాలా మంది వారు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతుంటారు, మరికొందరు యుఎఫ్ఓలు వారిని తీసుకెళ్లిండొచ్చు అని  కొందరు అనుకుంటున్నారు.అయితే, ఈ విషయాలు ఏవీ కూడా ఇప్పటివరకు రుజువు కాలేదు. ఎందుకంటే ఇవి కేవలం కల్పిత కథలు. హెరాల్డ్ అదృశ్యం నేటికీ కూడా మిస్టరీగానే వుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *