పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న నయనతార..షాక్ లో ప్రియుడు..?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ లేడీ అదరగొడుతోన్న అందాల రాశి. నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాలో నటించి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా నయనతార తమిళ్‌లో అరం డోరా  కోలమావు కోకిల,ఐరా వంటి  ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తమిళ్‌లో నయనతార నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అయితే తాజాగా నయనతార తన పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది..

 నయనతార పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఆమె కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలు మాత్రమే పోషించింది ఈ బ్యూటీ. ఆ తరువాత యాక్టింగ్ కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది.దీంతో ఆమె మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే నయనతార  జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే గత కొంత కాలంగా దర్శకుడు విగ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్న నయనతార తన పెళ్లి విషయం పై సంచలన నిర్ణయం  తీసుకుందని తెలిసింది. అయితే సాదాసీదాగా కెరీర్ ప్రారంభించిన ఆమె అతి తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్ బిరుదును అందుకుంది. పాత్ర ఏదైనా అందులో జీవించి అద్భుతంగా పండించగల ఈ హీరోయిన్ నైపుణ్యం దక్షిణాది మొత్తాన్ని మెచ్చుకునేలా చేసింది. అందుకే అన్ని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ నిర్మాతలు నయనతార డేట్ కోసం క్యూ కడుతుంటారు.

 అయితే అప్పట్లో గజిని చంద్రముఖి వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నయనతార. ఇదే క్రమంలో విక్టరీ వెంకటేష్ నటించిన లక్ష్మి ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నేరుగా అడుగుపెట్టింది. ఆ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో నటించింది. అయితే సినిమా వరంగల్ నయనతార ఎంత సక్సెస్ అయిందో వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో షాక్ లను ఎదుర్కొంది.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమెకు ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. అయితే కెరీర్ ఆరంభంలో యంగ్ హీరో తో డేటింగ్ డేటింగ్ చేసిన ఈ భామ, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్ళింది కానీ పెళ్లిపీటలు మాత్రం ఎక్కలేకపోయింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *