తెలంగాణ రాజకీయాల్లో తన సత్తాను చుపించబోతున్న.. ప్రశాంత్ కిషోర్..?

ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తనను వెతుక్కుంటూ వచ్చిన రాజకీయ పార్టీలకు అఖండ విజయం సాధించేలా స్ట్రాటజీలను తయారుచేసిన ప్రశాంత్ కిషోర్‌ తాజాగా రెండు రాష్ట్రాలు.. పశ్చిమాన పశ్చిమ బెంగాల్‌, దక్షిణాన తమిళనాడులో విజయం అందించిపెట్టారు. ఇప్పటివరకూ కింగ్ మేకర్ తనకు అపజయమే లేకుండా దూసుకెళ్ళాడు ప్రశాంత్ కిషోర్. దేశం నలుమూలలా ఓటరు ఎక్కడ నొక్కితే పడతాడో, ఎక్కడ ఓటరు ఏ నాయకుడి కి జై కొడతాడో పసిగట్టగల నేర్పరి ఆయన, అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లో తన సత్తాను చూపించబోతున్నట్లు సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే..

 ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను గెలిపించాడు. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ టీమ్ మెంబర్ అయినా సుభాష్ హైదరాబాద్ కు చేరుకున్నారని ఎంపీ కేశవరావు తో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. అలాగే మరో రెండు రోజుల్లో కేటీఆర్ తో కూడా సుభాష్ భేటీ కానున్నట్లు సమాచారం.

 అయితే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండాలని సంచలన ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు పట్టుమని పది రోజులు గడవక ముందే ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడనే వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ తో కలిసిచేస్తారని ముందు నుంచి రాజకీయ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఆఫీస్  కూడా లోటస్ పాండే ముందే ఉంటుంది. తెలంగాణ కొత్త రాజకీయ పార్టీ కసరత్తు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆయన వ్యూహకర్తగా ఉంటారని కొంతకాలం విజయవాడ పార్టీకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఇప్పుడు మళ్లీ టిఆర్ఎస్ పార్టీ తో కలిసి పని చేయబోతున్నారు అనే విషయం బయటకు రావడంతో వైయస్ షర్మిల సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి చూసుకుంటే కింగ్ మేకర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పెను సంచలనం అవుతోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *