కరోనా సమయంలో కూడా లక్షల సంపాదించిన మహిళలు..?

కరోనా కారణంగా గతేడాది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. చిన్న పరిశ్రల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. అలాగే సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ఈ ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే కరోనా తో కోట్లాదిమంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరికొంతమంది కరోనా సమయంలో కూడా ఉపాధిని వెతుక్కున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కొంతమంది మహిళలు కరోనా సమయంలో కూడా 25 లక్షల రూపాయలు సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయని మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ మహిళ సంఘాలు నిరూపించాయి. వారు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి పొందడంతోపాటు లాభాలతో ఏకంగా భవనమే నిర్మించుకున్నారు. అయితే గతేడాది కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోమాస్కు లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. ఆమె సలహా సూచనలతో  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహిళా సంఘాల ద్వారా మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టింది. డిఆర్డిఎ కు కేటాయించిన 30 లక్షల నిధులు నుంచి సంఘాలు మాస్కులు తయారీ మొదలు పెట్టాయి. మూడు వేల మందికి పైగా మహిళలు ఇంట్లోనే ఉండి మాస్కులు తయారు చేశారు.

 అయితే కరోనా సమయంలో ఎంతో మంది ఉపాధి లేక  చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ మహిళలు మాత్రం మాస్కులు తయారీ తో పొట్ట నింపుకున్నారు. సంవత్సర కాలంలో దాదాపుగా ఆరు లక్షలకు పైగా మార్కులు తయారు చేశారు. స్థానిక ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నారాయణ సహకారంతో మాస్కులు పోచంపల్లి ఇక్కత్ నారాయణపేట పట్టు నూరు శాతం నూలు  ఇలా రకరకాల మాస్కులను తయారు చేశారు.  అలాగే ఈ మాస్క్ లకు ప్రాచుర్యం లభించి ఆర్డర్లు పోటెత్తాయి. వాటిలో భాగంగా మెట్రో రైల్, ఫిక్కీ,రాంకిలాంటి సంస్థలు, విజయ్ దేవరకొండ టబు ఫరాఖాన్ ఇలాంటి చిత్రసీమ ప్రముఖులు కూడా ఆర్డర్లు ఇచ్చారు. ఇకపోతే డిలైట్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఏకంగా 63 వేల మార్కుల తయారీని చేయాలని కోరింది  దీనితో నారాయణపేట మహిళా సంఘాలు తయారుచేస్తున్న మాస్కులకు మంచి గిరాకీ ఏర్పడింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *