ఈటల స్థానాన్ని భర్తీ చేయనున్న మరో మంత్రి.. ఎవరంటే …?

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గురించే చర్చలు వినిపిస్తున్నాయి. ఆయనపై ఎక్కడ చూసినా కథనాలే, వార్తలే. ఓవైపు ఈటల రాజేందర్ కరోనా నియంత్రణలో బిజీబిజీగా ఉండగా మరోవైపు మీడియాలో ఈటల భూకబ్జా అంటూ కథనాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న వంద ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖపై వెంటనే స్పందించిన కేసీఆర్.. ఆ భూములపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇటీవలే వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ తొలగించారు. అయితే ప్రస్తుతం ఈటల స్థానాన్ని మరో మంత్రి భర్తీ చేయనున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే..

 వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ తొలగించారు. అయితే ఆ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. గత రెండు మూడు రోజులుగా వైద్య శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ మంత్రి వర్గ ఉండాలి వశీకరణ కు ముహూర్తం ఖరారు అయినట్లు కనిపిస్తోంది. వచ్చే రెండు మూడు రోజుల్లోనే కొత్త మంత్రులకు అవకాశం దక్కనున్నట్టుగా గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పుదుచ్చేరిలోని ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హడావుడిగా హైదరాబాద్ కు వస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పుదుచ్చేరి తమిళనాడులో లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అయితే తమిళిసై హైదరాబాద్ కు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసమే వస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం కరోనా సమయంలో వైద్య శాఖలో సీఎం దగ్గరే ఉంచుకోకుండా మరొకరికి అప్పగిస్తేనే బెటర్ అనే చర్చ టీఆర్ఎస్  నేతల్లోనూ జరుగుతుంది. దీనితో కే సీఎం కేసీఆర్ కూడా వైద్య శాఖకు కొత్త మంత్రి ని నియమించాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. అయితే ఇందులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటగా కెసిఆర్ తొలి కేబినెట్ లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి కి రెండోసారి మంత్రి అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు ఈటల స్థానంలోకి లక్ష్మారెడ్డి కేబినెట్ లోకి తీసుకొని ఆయనకు వైద్య శాఖను అప్పగించవచ్చని చర్చలు బలంగా జరుగుతున్నాయి.

 అయితే స్వయంగా వైద్యుడు అయిన లక్ష్మారెడ్డి అయితే బెటర్ అనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారని అంటున్నారు.. ఇకపోతే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు వైద్య శాఖను అప్పగించవచ్చు అనే మరో చర్చ కూడా జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హరీష్ రావు పాల్గొనటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. అయితే  మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈదుల తోపాటుగా మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చని భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి  మంచి వర్గంలో తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్వహించారని చెబుతున్నారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి కి తప్పకపోవచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్ గా మారింది. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రి పదవి పై ఇప్పటికే కేసీఆర్ సంకేతం  ఇచ్చారని చర్చ జరుగుతుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *