సూపర్ స్టార్ కృష్ణ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఇక ఈయన అనారోగ్య సమస్యల వల్ల నవంబర్ 15న మరణించారు. ఈయన మరణించిన విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయింది. ఇక ఎందరో అభిమానుల, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య కృష్ణ గారి అంత్యక్రియలు ముగిసాయి. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ సంవత్సరం ఇది మూడో మరణం. ఒకే సంవత్సరంలో వరుసగా ముగ్గురు చనిపోవడంతో మహేష్ బాబు ఒంటరివాడయ్యాడు.

ఆయన మీద ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమందేమో ఆయనకు వ్యతిరేకంగా రాస్తే ఎక్కువ మంది ఆయన మీద పాజిటివ్గా రాశారు. అయితే తాజాగా యూట్యూబ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సూపర్ స్టార్ కృష్ణ తన మంచం కింద ఏదో అట్టముక్కను రాసి పెట్టుకున్నాడు అంటూ ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ తన నటన తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే ఆయన తన సినీ జీవితంలో సంపాదించిన చాలా డబ్బుని వ్యసనాలకు బానిసై పోగొట్టుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కృష్ణ తన మంచం కింద ఒక అట్ట ముక్క లో ఏదో మ్యాటర్ రాసుకున్నాడట. అయితే అందులో ఏముందంటే.. కృష్ణ ఎవరికీ తెలియకుండా మహేష్ బాబు కి ఒక స్థలం కొన్నారట.ఇక ఆ స్థలానికి సంబంధించిన వివరాలన్నింటినీ అట్టముక్క మీద రాసి పెట్టుకున్నాడట. అయితే రహస్యంగా మహేష్ బాబు కోసం కొన్న ఆ ఆస్తిని సీతారా, గౌతమ్ లకు సమానంగా పంచి పెట్టమని కూడా రాసి పెట్టుకున్నాడట.

ఇక ఆ ఆస్తి కి సంబంధించిన డాక్యుమెంట్లను ఎక్కడ పెట్టారో వాటి వివరాలు కూడా కృష్ణ ఆ అట్ఠ ముక్కపై రాసి పెట్టాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే కృష్ణ సీక్రెట్ గా కొన్న ఆ ఆస్తి కొన్ని లక్షల కోట్ల విలువ చేస్తుందని,భవిష్యత్తులో కృష్ణ కొన్న ప్రాపర్టీ విలువ కొన్ని కోట్ల లో పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అవ్వడంతో తొందరగా ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేశారట. అయితే ఈ వీడియో మీద క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు మేనేజర్ కృష్ణ మీద వచ్చే అలాంటి అబద్ధపు వార్తలు నమ్మకండి అంటూ చెప్పారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *