సమంత ప్రధాన పాత్ర లో యశోద అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హరీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ను నవంబర్ 11 న విడుదల చేస్తుండగా ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని ఫైనల్ గా నవంబర్ 11న విడుదల చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా టీజర్ ను విడుదల చేస్తుంది చిత్ర బృందం. దీనికోసం పాన్ ఇండియా హీరోలను రంగంలోకి దించింది చిత్ర బృందం. పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ సూర్య రక్షిత్ శెట్టి దుల్కర్ సల్మాన్ వరుణ్ ధావన్ లు రంగంలోకి దిగుతున్నారు.ఇదిలా వుంటే సామ్ నటించిన ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *