మెగా స్టార్ చిరంజీవి కథ విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా ఆ సినిమా ను క్యాన్సర్ చేయడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అలా ఇటీవలే ఓ యువ దర్శకుడి కథను రిజెక్ట్ చేశాడు చిరు. ఛలో సినిమా తో దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల భీష్మ తో రెండో విజయాన్ని కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే అయన తన మూడో సినిమా ను చిరు తో చేయాలని భావించాడు.

కథ పరంగా సినిమా ను ఒకే చెప్పిన చిరు ఫుల్ నేరేషన్ లో మాత్రం నిరాశపడ్డాడట. దాంతో ఆ సినిమా ను క్యాన్సర్ చేశాడట. దాంతో ఈ సినిమాను మరో హీరో కి చెప్పాడట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడుస్తుందనీ, కథ వినగానే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమా తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఇదే కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *