నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న సినిమా కు టైటిల్ ఖరారు అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలకృష్ణ 107 వ సినిమాగా రూపొందగా తాజాగా ఈ సినిమా కు వీర సింహా రెడ్డి అనే టైటిల్ ను నిర్ణయించారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించిన బాలకృష్ణ ఈ సినిమా తో ఆ హిట్ జోష్ ను కంటిన్యూ చేయబోతున్నాడు.

ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచినా బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా ను చేస్తుండడం విశేషం. ఆయన ఈ జోనర్ లో చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ అయన ఈ సినిమా ను చేయడం విశేషం. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *