టెలివిజన్ వ్యూయ‌ర్ షిప్‌ డేటా ట్యాంపరింగ్ వ్యవహారం ఆంధ్ర‌ప్ర‌దేశ్/తెలంగాణ మార్కెట్‌ను తాకింది.ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మార్కెట్లో పెద్ద ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపిస్తూ I&B మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌కు చేరిన లేఖ. లేఖతో పాటు విజువల్ ప్రూఫ్‌ను, పెన్‌డ్రైవ్‌ను కూడా కేంద్ర మంత్రికి పంపిన ఫిర్యాదుదారుడు

Adgully.com వెబ్ సైట్ ఈ లేఖలో ఉన్న సంచలన అంశాల్ని బయట పెట్టింది. అందులో కొన్ని కీలకమైన పాయింట్స్.

1.మాస్ స్కేల్ ట్యాంపరింగ్ ఫలితంగానే గత ఏడాదిన్నర కాలంగా NTV రేటింగ్స్ దాదాపు నిలువుగా పెరిగాయి.

2.ఈ తారుమారు చేసిన డేటా ఆధారంగా NTV తామే నెం.1 అంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. ఇది ఖచ్చితంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడమే.

3.NTv చేస్తున్న తప్పుడు ప్రకటనలు చూసి ప్రజలు, వ్యాపారవేత్తలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

4.కొన్ని ఇతర చిన్న ఛానల్స్ కూడా ఈ తరహా తప్పుడు విధానాలకు పాల్పడుతున్నాయి.

5.దాదాపు 800 పైగా ప్యానల్ కుటుంబాల ద్వారా వ్యవస్థీకృత పద్ధ‌తిలో డేటాని ప్రభావితం చేసే విధానం కొనసాగుతోంది.

BARC మీటర్ల గోప్యతని, పవిత్రతని పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖ లో విజ్ఞప్తి చేసిన ఫిర్యాదుదారుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *