మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సినిమా నిన్న విడుదలై నెగెటివ్ టాక్ ను అందుకుంది. అయినా ఈ సినిమా కలెక్షన్స్ కు ఏమాత్రం ఢోకా లేదు. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం ‘విక్రమ్ వేద’ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ PS1 కి ఏం నష్టం వాటిల్లలేదు అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ వచ్చినతప్పటికీ త‌మిళ‌నాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ల‌భిస్తోంది. నేటివిటీ సినిమా కావడం ఈ సినిమా కు అక్కడ మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పాలి.

తొలి రోజు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. దీన్ని బట్టి ఈ సినిమా అక్కడి వారిని ఎలా అలరించిందో చెప్పొచ్చు. భారీ తారాగణం నటించిన సినిమా కావడంతో, అందరు ఎంతో ఎదురుచూసిన సినిమా కావడంతో ఈ సినిమా కు ఈ స్థాయి లో వసూళ్లు వచ్చాయి. తమిళనాడులో ఈ సినిమా ఏకంగా 25.86 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వాలిమై (రూ. 36.17 కోట్లు), బీస్ట్ (రూ. 26.40 కోట్లు) త‌ర్వాత మూడో స్థానంలో నిలిచింది.

హిందీ సర్క్యూట్ సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లను నమోదు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. పొన్నియిన్ సెల్వన్ రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. మ‌రిన్ని పార్టులు కూడా ఉన్నాయి.త్వరలోనే రెండో పార్ట్ విడుదలకు సిద్ధం కాబోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *