వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ఇప్పుడు రెండు నెలలు తిరక్కుండానే మరో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. అయన హీరో గా ధమాకా అనే సినిమా రూపొందింది. మాస్ ఆడియన్స్ మనసు తెలిసిన నక్కిన త్రినాథరావు ఈ సినిమాను రూపొందించాడు. ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎంతో బాగా చేసే ఈ దర్శకుడు ఈ సినిమా ను మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తూ ఉండడం విషెహ్సం. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందించాడు.

గతంలో రవితేజ బెంగాల్ టైగర్ సినిమా కి సంగీతం అందించిన భీమ్స్ మళ్ళీ అయన సినిమా కి సంగీతం అందించడం విశేషం. ఈ నేపథ్యంలో అయన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఇటీవల ఈ సినిమా నుంచి ‘జింతాక్’ సాంగ్ ను వదిలారు. మంచి మాస్ బీట్ తో ఉన్న ఈ పాటకి మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించింది. 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను ఈ సాంగ్ దక్కించుకోవడం విశేషం. ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీ లీల.

ఇక ఈ పాటకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం అందపడుతుంది. తాజాగా మేకర్స్ అధికారకంగా ఈ పాటకు 20 మిలియన్స్ వచ్చిన విషయాన్నీ ప్రకటించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీతో కలిసి భీమ్స్ ఆలపించాడు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాలో రావు రమేశ్ .. సచిన్ ఖేడ్ కర్ .. జయరామ్ .. పవిత్ర లోకేశ్ .. తులసి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.రెండు ఫ్లాప్ లతో నిరాశలో ఉన్న రవితేజ అభిమానులకు ఈ సినిమా విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *