కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. లోకేష్ కనక రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లోని చివరి పది నిముషాలు సినిమాను భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేసిందని చెప్పాలి. సూర్య నటించిన రోలెక్స్ పాత్ర కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆ పాత్ర తో ఫుల్ సినిమా చేయాలనే డిమాండ్ ఇప్పుడు ప్రేక్షకులలో ఏర్పడింది.

అయితే విక్రమ్ 2 సినిమా నే రోలెక్స్ ఫుల్ సినిమా అని ఇన్నాళ్లు చెప్పడంతో ఈ విక్రమ్ సినిమా రెండో పార్ట్ ఎప్పుడు రూపొందుతుందో అని అందరు ఎదురుచూశారు. అలా ఇక ‘విక్రమ్ 2’ ఎప్పుడు ఉండనుందనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో సూర్యకి ఎదురైంది. ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తాననీ, అందుకు ఇంకా సమయం ఉందని సూర్య సమాధానమిచ్చాడు. లోకేశ్ కనగరాజ్ తనని కలిసి కథ చెప్పినప్పుడు, విలన్ పాత్రే అయినా కమల్ సార్ కోసమే చేయాలనుకున్నాను .. చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం లోకేష్ విజయ్ దళపతి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఖైదీ 2 చేయాల్సి ఉంది. అప్పుడు కానీ ఈ విక్రమ్ 2 సినిమాను ఆయన చేయడు. అప్పైదాకా రోలెక్స్ ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed