ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఇక ఏ మాయ చేసావే సినిమా టైం లో నాగచైతన్యతో ప్రేమలో పడి కొన్ని సంవత్సరాలు రహస్యంగా వీరి మధ్య ప్రేమ నడిపించి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నామని చెప్పి అందర్నీ బాధ పెట్టారు. ఇక విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే సమంత హీరోయిన్ గా వచ్చిన యశోద సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అంతేగాక యశోద సినిమాలో సమంత నటనకు చాలామంది ఫిదా అయ్యి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కొన్ని రోజుల నుండి సమంత మాయాసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని ఈ మధ్యనే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటో షేర్ చేసింది.

ఇక సమంత తన వ్యాధి గురించి అధికారికంగా ప్రకటించగానే చాలామంది సెలబ్రిటీలు,అభిమానులు పెద్ద ఎత్తున ఆమె కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా నటి కల్పిక గణేష్ సమంత వ్యాధిపై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. యశోద సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కల్పిక గణేష్ తనకు కూడా సమంత లాగే ఆ వ్యాధి ఉంది అని చెబుతూ బాధపడింది. అలాగే ఈ కార్యక్రమానికి రానందుకు మేము సమంత ను చాలా మిస్ అవుతున్నాం. కానీ సమంత నేను సక్సెస్ మీట్ కు వస్తాను అని చెప్పి మాకు అబద్ధం చెప్పింది.

నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉన్నా కూడా సమంత కోసం ఈ సక్సెస్ మీట్ కి వచ్చాను. అయితే సమంతకు ఉన్న మయాసైటిస్ అనే వ్యాధి నాకు 13 ఏళ్ల క్రితమే ఉంది. ప్రస్తుతం నా వ్యాధి ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది కానీ సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి థర్డ్ స్టేజ్ లో ఉంది అంటూ నటి కల్పిక గణేష్ సంచలన విషయాన్ని బయట పెట్టింది.ఇక ఈ వార్త తెల్సిన సమంత అభిమానులు సమంత ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *