కొన్ని వందల ఎకరాల భూమి ఉన్నా కూడా కృష్ణ కోసం మహేష్ బాబు ఒక ఎకరం కూడా కేటాయించి.. ఆయన అంత్యక్రియలు జరపలేదు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కూడా గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎవరు చెప్పినా వినకుండా మహేష్ బాబు మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు పూర్తి చేయడంతో ప్రతి ఒక్కరూ మహేష్ బాబు తీరుపై నిప్పులు కక్కుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా స్మశాన వాటికలో నిర్వహించడంపై పలువురు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆది శేషగిరిరావు , మంజుల, నమ్రత వంటి వారు ఎంతోమంది చెప్పి చూసినా మహేష్ బాబు వినకుండా ఇలా స్మశాన వాటికలోనే తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Superstar Krishna's Brother To Join TDP On Thursday

నిజానికి హైదరాబాదులో స్టూడియోలు నిర్మించకున్న మొదటి జనరేషన్ హీరోలు చనిపోతే దాదాపు అందరూ కూడా తమ స్టూడియోలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్, రామానాయుడు స్టూడియోలో రామానాయుడు సమాధిని కట్టించి స్మృతి చిహ్నాలు కూడా ఏర్పాటు చేశారు. కృష్ణ గారికి కూడా అదే గౌరవం ఇవ్వాలి అని పద్మాలయ స్టూడియోలోనే అంత్యక్రియలు చేసి ఉండాల్సింది కదా అని కూడా వాపోతున్నారు.

Actor Krishna Dies: Mahesh Babu's father passes away; he lost his mom &  brother earlier this year | Entertainment News – India TV

దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. “దీనికి ఒక కారణం ఉందని తెలిపారు. కృష్ణ గారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలని భావనతో మహాప్రస్థానంలో పూర్తి చేసామని”.. స్పష్టం చేశారు. ఇక కృష్ణ గారి జ్ఞాపకాలు పదిలంగా ఉండే విధంగా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.

మెమోరియల్ లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలు, ఫోటోలు, షీల్డ్లు అన్నీ కూడా అక్కడే ఉంచనున్నట్టు సమాచారం. మొత్తానికి అయితే మహేష్ బాబు తన తల్లి కోసం తన తండ్రి దేహాన్ని కూడా స్మశాన వాటికలోనే దహనం చేసి..స్వర్గంలో కూడా తన తల్లిదండ్రులు కలిపే ప్రయత్నం చేశారు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *