సీతారామం సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గామారి దేశంలనే మృనాల్ ఠాగూర్ పేరు మారు మోగిపోయింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మృనాల్ అంతకుముందు బుల్లితెర మీద కొన్ని సీరియల్స్ లో అలాగే సహాయ పాత్రలో నటించింది.కానీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక మొదటిసారి మరాఠీ సినిమాల్లో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది.

కానీ ఇన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కేవలం తెలుగులో వచ్చిన సీతారామం సినిమాతో వచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. సీతారామం సినిమాలో మలయాళ హీరో అయిన దుల్కర్ సల్మాన్ సరసన మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా కనిపించింది. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా ఒక ప్రధాన పాత్రలో నటించింది. అయితే సీతారామం సినిమా విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఈ సినిమాకు చాలామంది ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

ప్రేమ కథ అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో మృనాల్ అచ్చ తెలుగు అమ్మాయిలాగా అందరిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మృణాలకి వరుసగా తెలుగులో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే ఈమెకు వస్తున్నాయి అనేది నిజమే కానీ ఏ ఒక్క సినిమాకి కూడా మృనాల్ సైన్ చేయడం లేదట. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం ఫోటోషూట్లు చేస్తూ వస్తోంది.

అయితే ఇన్ని సినిమాలు వస్తున్నా ఆమె ఒప్పుకోక పోవడానికి ఒకే ఒక్క కారణం ఉందట అదే రెమ్యూనరేషన్. అవును..ఈమె సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నెక్స్ట్ రాబోయే సినిమాలో రెమ్యూనరేషన్ కొన్ని కోట్లలో డిమాండ్ చేద్దాం అని అనుకుందట. దాంతో ఈమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడిగేసరికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతున్నాయి. ఇక రెమ్యూనరేషన్ విషయంలో ఇలాగే భీష్మించుకుకూర్చుంటే అవకాశాలు రావు అని చాలామంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *