బిగ్ బాస్ సీజన్ 6 ను మొదట చూడడానికి అంతగా ఆసక్తి అనిపించకపోయినప్పటికీ రానురాను హౌస్ లో గొడవలు, ప్రేమలు ఒక రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక అలాగే చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు టాప్ ఫైవ్ వరకు ఉంటారు అనుకున్న వాళ్లు ఎలిమినేట్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కూడా ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామో అని టెన్షన్ పడుతూ తమ స్థాయికి మించి ఆడుతున్నారు. ఇక కొంతమంది టైటిల్ కోసం పోరాడుతుంటే ఇంకొంతమందేమో తమ స్టైల్లో ప్రేమాను నడుపుతూ హౌస్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

ప్రస్తుతం ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ఈ జంట మీద నెటిజన్లకు కొత్త అనుమానాలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ 75వ రోజుకు చేరుకున్న కూడా కొంచెం మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి తక్కువ టిఆర్పి రేటింగ్ వస్తుంది. అంతేకాకుండా ఊహించని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం వల్ల ఈ షోపై చాలామంది ఇంట్రెస్ట్ తగ్గించారు. ఇక ఈవారం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు.అయితే ఇందులో బయటికి పోకుండా ఉండడానికి బిగ్ బాస్ ఒక ఎడిక్షన్ ఫ్రీ పాస్ గురించి చెప్పారు.

ఏ కంటెస్టెంట్ అయితే బజర్ ని మొదటగా ప్రెస్ చేసి ఒక్కో స్లాట్ ని కొనుక్కుంటారో వాళ్లే ఎడిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం పొందుతారు అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చారు. ఇక ఇందులో రేవంత్, శ్రీహాన్,ఫైమా ముగ్గురు బజర్ మొదటగా ప్రెస్ చేశారు.ఇక మరోవైపు ఆదిరెడ్డి నేను అస్సలు గేమ్ ఆడను అని పట్టుబట్టి కూర్చున్నాడు.ఇక ఇందులో భాగంగా శ్రీహన్ నేను ఆ పాస్ గెలిస్తే ఖచ్చితంగా నీకే ఉపయోగిస్తానని శ్రీ సత్యతో చెప్పాడు. శ్రీ సత్య ఎందుకు అని అడిగితే నువ్వు ఒక్క వారమైన నాతో కలిసి ఉంటావు కదా అని శ్రీహన్ అన్నాడు. ఇక శ్రీహన్ చెప్పిన మాటలకు శ్రీ సత్య ముఖం మీద చేయి పెట్టుకొని మరీ తెగ మురిసిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే శ్రీహాన్ కి ముందే సిరి హనుమంతు తో రిలేషన్ ఉంది.

కానీ హౌస్ లో శ్రీసత్య తో పులిహోర కలపడానికి ట్రై చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ హౌస్ నుండి బయటికి వచ్చాక మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తారు. కానీ ఇది అంతకు ముందు షణ్ముఖ్,సిరి చేసిన దానిలాగా ప్రేక్షకులకు అనిపిస్తోంది.ఇక ఇలాగే శ్రీహాన్ శ్రీసత్య తో ప్రవర్తిస్తూ ఉంటే కచ్చితంగా వీళ్లు హౌస్ నుండి బయటకు వచ్చాక సిరి తో శ్రీహాన్ కి బ్రేకప్ అవ్వక తప్పదు అంటున్నారు వీరి మధ్య రిలేషన్ చూసిన ప్రేక్షకులు. మరికొంతమందేమో పాపం సిరి కూడా దీప్తి లా ఒంటరి అవుతుంది అని అంటున్నారు. ఇంకొంతమంది నువ్వు దీప్తి సునయనకు అన్యాయం చేస్తే లేదు కానీ ఇప్పుడు శ్రీ సత్య నీకు చేస్తే వచ్చిందా అంటూ తిడుతున్నారు.ఇక ఈ విషయం లో ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *