తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మన స్టార్ హీరోలు తమ తండ్రులకు వెన్నుపోటు పొడుస్తున్నట్లే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలో కలిపి నిన్న సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కృష్ణకు సంబంధించిన వార్తలపై జోరు తగ్గుతుంది. కానీ అంతలోనే కృష్ణకు మెమోరియల్ కట్టబోతున్నట్టు ఒక వార్త రావడంతో మీడియా మళ్లీ పుంజుకుందనే చెప్పాలి. వాస్తవానికి కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడంతో గందరగోళం సృష్టించారు. 100 ఎకరాలకు పైగా భూమి ఉన్న కృష్ణకు మహేష్ బాబు ఒక ఎకరం కూడా కేటాయించి అంత్యక్రియలు ఎందుకు చేయలేదు? అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

అయితే ఆ డామేజ్ ను కప్పిపుచ్చే విధంగా ఇప్పుడు మెమోరియల్ కట్టిస్తామని చెప్పడంతో అభిమానులకు కాస్త ప్రశాంతత లభించిందని చెప్పాలి . అయితే మహేష్ బాబు తన తండ్రి కృష్ణకు మాత్రమే కాదు స్టార్ హీరోలు చాలామంది తమ తండ్రులకు అన్యాయం చేస్తున్నారనేది పచ్చి వాస్తవమని చెప్పవచ్చు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు చనిపోయి సంవత్సరాలు గడుస్తోంది .. అయినా కూడా ఆయన మెమోరియల్ గురించి నాగార్జున నేటి వరకు ఆలోచించకపోవడం మరొక బాధాకరమైన విషయమని చెప్పాలి. మరొకవైపు ఆయన అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ నిర్వహించారో కనీసం ఆ గుర్తులు కూడా లేవు. మరీ నిజం చెప్పాలి అంటే అన్నపూర్ణ స్టూడియో ఇంత బాగా వెలిగిపోతుండడం వెనుక అక్కినేని నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారు. మరి ఆయన చనిపోయాక ఒక విగ్రహం కూడా కట్టక పోవడానికి గల కారణం ఏంటి? ఆయన తన జీవితంలో సాధించిన అవార్డులు, జ్ఞాపికలు, జ్ఞాపకాలు అన్నీ ఒక గదిలో భద్రపరిస్తే అందులో దొంగతనం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది.

ఇలా కృష్ణ, అక్కినేని లకు మాత్రమే కాదు సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పవచ్చు . గవర్నమెంట్ కట్టించిన స్మారకం మినహా ఆయన ఆస్తులను అనుభవిస్తున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయన కోసం ఏనాడు ఏమీ చేయలేదు. ఆయనకు సంబంధించిన ఎన్నో అవార్డ్స్ మొదట్లో లక్ష్మీపార్వతి దగ్గర ఉండేవి. ఆ తర్వాత బలవంతంగా హరికృష్ణ అన్ని తీసుకెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత అవి ఏమయ్యాయో ? ఎక్కడున్నాయో? ఎవరికీ తెలియదు. ఇలా ఎన్నో అపవాదాలు మోస్తున్న స్టార్ హీరోలు ఎలాగో తమ పనులను గుర్తు చేసుకోవడం లేదు.. కనీసం వీటన్నింటిని గుర్తు పెట్టుకొని మహేష్ బాబు అయినా తన తండ్రి కోసం నిజాయితీగా ఒక స్మారక మందిరం కట్టి జనాలకు ఆయన జ్ఞాపకాలను ఎప్పుడైనా చూసుకునే విధంగా మెమోరియల్ నిర్మిస్తారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *