హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అనే వార్తలు గత కొన్ని రోజులుగా షికార్లు చేస్తున్నాయి. దీనిపట్ల తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ లో హీరో గా విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ఆది పినిశెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిక్కీ. అయితే వీరి పెళ్లి అయ్యి కొన్ని నెలలు కూడా కాలేదు అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపించాయి.

ఇది ముదురుతుండడంతో ఆమె స్పందించింది. ఈ బిగ్ న్యూస్ గురించి నాకు కూడా తెలియదు. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు నా తరపున వైరల్ అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. ప్లీజ్.. నాకు ఆ డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది’ అంటూ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది.

“నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. భవిష్యత్తులో అయితే ఈ అమేజింగ్ న్యూస్ ని నేనే ఫస్ట్ తెలియజేస్తా. దయజేసి రూమర్లను ప్రచారం చేయకండి” అంటూ నిక్కీ గల్రాని తన నోట్ ద్వారా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *