ప్రభాస్ హీరో గా నటిస్తున్న చాలా సినిమాలలో ఒకటి మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా. అసలు వీరి కాంబో సినిమా వస్తుందని ఎవరు కూడా కలలో కూడా ఊహించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ దర్శకుడితో చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎప్పటినుంచి సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఈ వార్తలు ఇంతకీ అధికారికంగా ప్రకటించకపోవడం అసలు ఈ సినిమా ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది.

తాజాగా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుకాబోతుందనే వార్తలు రావడం విషెహ్శం. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లు నటించబోతున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వీరిద్దరు కాకుండా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని మారుతి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.

అయితే ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నింటికీ అక్టోబర్ 17వ తారీఖున సమాధానం లభించే అవకాశం ఉందని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఈ సినిమా కి సంబంధించి అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తాడో ప్రభాస్ చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *