టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇంకా మొదలుపెట్టకపోవడం సినిమాపై రకరకాల అనుమానాలు కలగడానికి కారణం అవుతుంది. ఎన్టీఆర్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సంచలనం సృష్టించి ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడంతో ఆయన తదుపరి సినిమా కూడా భారీ గా ఉండాలని భావించడం ఇటు ‘ఆచార్య’తో కొరటాలకి ఫ్లాప్ పడటం ఆయన తన కథ తో ఎన్టీఆర్ ను పూర్తి స్థాయి లో మెప్పించకపోవడం ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైందని అంటున్నారు.

అయితే చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఇప్పుడు కొరటాల శివ ఓ కొత్త కథని ఎన్టీఆర్ తో చేయబోతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుందన్న మాట. కొరటాల కొత్త కథ నచ్చితేనే ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడనేది బయట వినిపిస్తున్న టాక్. దీనిని బట్టి చూస్తుంటే ఈ ప్రాజెక్టు మరింత లేట్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *