హను రాఘవపూడి ఆయనను డీల్ చేయగలడా!!

ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా చేసే దర్శకుడైన హను రాఘవ పూడి ఇటీవల సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రేమ కథా సినిమాను చూసిన ఫీలింగ్ ప్రేక్షకులలో కలిగగా ఈ సినిమా ద్వారా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క సీన్ కూడా ఎంతో అద్భుతంగా మలిచి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు చేయబోయే తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
గత కొన్ని రోజులుగా ఫలానా హీరోతో సినిమా చేయబోతున్నాడని రకరకాల హీరోల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. తాజాగా ఆయనకు ఓ కథ చెప్పడానికి ఈ దర్శకుడు రెడీ అయ్యాడట. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఉండే ఒక మాస్ మసాలా సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమాకు కనుక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన కెరియర్ లోనే ఒక వెరైటీ సినిమాగా ఇది ఉండబోతుంది అని చెబుతున్నారు.
ఇటు ఎన్టీఆర్ కూడా తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అన్న క్లారిటీ ఇప్పటి దాకా ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉంది కానీ దానికి మరి కొంత సమయం పట్టేలా ఉంది. కొరటాల శివ తో సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాను కూడా చేయాలని ఉద్దేశంతోనే హను రాఘవపూడి చెప్పే కథను వినబోతున్నాడట. ఆ విధంగా ఈ రెండు సినిమాలను ఒకేసారి చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఇకపోతే యువ దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో చేయవలసిన సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేశాడు ఎన్టీఆర్. దాదాపుగా ఆ సినిమా ఎన్టీఆర్ తో లైనప్ లో లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హను రాఘవపూడి సినిమాను ఓకే చేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *