రాంగ్ టైం లో దిగుతున్న వారసుడు!!

విజయ్ దళపతి హీరో గా తెరకెక్కుతున్న వారసుడు సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకుడుకాగా ఈ సినిమా ఈ రెండు భాషల్లో విడుదల కాబోతుండడం విశేషం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. ప్రభు శరత్ కుమార్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ కావడం కొంతమంది ని నిరాశపరుస్తుంది. తెలుగు లో చాలా సినిమాలు రిలీజ్ అవుతుండగా ఈ సినిమా అప్పుడు రావడం కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మరి ఇప్పటికే ఐదు సినిమాలు రాబోతున్న వేళ ఈ సినిమా విడుదల తేదీ మారుస్తారా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *