మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ కి రంగం సిద్ధం!!

గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ను ఎంతో ఆకట్టుకున్న చిరంజీవి ఇప్పుడు తన తదుపరి సినిమాలను చేసేవిధంగా ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా వాల్తేరు వీరయ్య సినిమా నే ఫైనల్ చేయబోతున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. రవితేజ కూడా ఒక ముఖ్యమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా కే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులు పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు.

దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇవి చిరంజీవి సినిమాపై ఎంతటి క్రేజ్ ను పెంచుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *