బాలకృష్ణ సంక్రాంతికి రావడం పక్కా!!

నందమూరి బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా సంక్రాంతి కి విడుదల చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది. రీసెంట్ గా ‘టర్కీ’ షెడ్యూల్ ను పూర్తిచేశారు. హీరో .. హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా యొక్క మేజర్ భాగం పూర్తయ్యింది అని చెప్పొచ్చు ఫైనల్ గా ఈ సినిమా యొక్క ఆఖరి షెడ్యూల్ ను హైదరాబాద్ సమీపంలోని మొయినా బాద్ లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగు మొదలెట్టనున్నట్టుగా చెబుతున్నారు.

ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్న నేపథ్యంలో ‘అఖండ’ హిట్ తరువాత బాలయ్య .. ‘క్రాక్’ హిట్ తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతి బరిలో ఆయన అందుకున్న సక్సెస్ లు ఎక్కువ. అందువలన ఈ సినిమాను జనవరి 12వ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *