ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ ఎప్పుడంటే!!

ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మాళవిక మోహనన్, నిధి అగ్గార్వాల్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కు సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క పోస్టర్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఉద్దేశంతో ఫొటో షూట్ జరిపారని అంటున్నారు.

హారర్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమా చిన్న బడ్జెట్ లో ఫాస్ట్ గా చేయబోతున్నారని అంటున్నారు. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *