టాలీవుడ్ లో లెక్కలమాస్టర్ గా పెరుగాంచిన అగ్ర డైరెక్టర్ సుకుమార్ గురించి అందరికి తెల్సు.పుష్ప మూవీ తో తో ప్యాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా ప్రసిద్ధి చెందాడు.ఆయన ఇపుడు తెలుగులో నే కాక హిందీలో కూడా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారు.

సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి సంబంధించి ఆయన ఒక ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసారని,సుకుమార్, వివేక్ మరియు అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ ప్రాజెక్ట్చేయబోతున్నట్లుగా తరుణ్ ఆదర్స్ స్వయంగా ట్రీట్ చేశారు.

“కాశ్మీర్ ఫైల్స్” వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీసిన డైరెక్టర్ వివేక్ ఈ మూవీ కోసం లెక్కల మాస్టర్ తో చేతులు కలపనున్నారు. అలాగే అభిషేక్ అగర్వాల్ నిఖిల్తో హీరోగా చేసిన “కార్తికేయ 2” మూవీ ని కూడా హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి విజయాన్ని కైవసం చేసుకున్నారు.లేటెస్ట్ గా వీరు ముగ్గురు కలిసి ఉన్న ఒక పిక్ కూడా ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక మూవీ గురించిన ఆఫీసియల్ ప్రకటన, మరింత ఇన్ఫర్మేషన్ త్వరలో బయటకు రానున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *