చైతు సినిమా కోసం రంగంలోకి స్టార్స్!!

అక్కినేని నాగచైతన్య హీరో గా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుపుకుంటుంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఎంపికైన స్టార్స్ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కొంతమంది స్టార్ నటీనటుల గురించి చిత్ర బృందం వెల్లడించిందని.

ఒక ముఖ్యమైన పాత్రకిగాను ప్రియమణిని తీసుకున్నారు. అంతేకాకుండా మరో కీలకమైన పాత్ర కోసం సంపత్ రాజ్ ను తీసుకొస్తున్నారు. వీరిద్దరూ నటించడం సినిమా కి మంచి ప్లస్ అవుతుందని చెప్పాలి. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో వారు జాయిన్ అవుతున్నారు.తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *