చిరు, బాలయ్య ల మధ్యనే అసలైన సమరం!!

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి కి ప్రేక్షకులను వేరే స్థాయిలో అలరిస్తాయని వారి వారి అభిమానులు చెబుతున్నారు. ఆ విధంగా ఈ సారి భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ జరగబోతుంది.
బాబీ దర్శకత్వంలో మాస్ మసాలా సినిమాగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాను మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను రెండిటిని కూడా ఒకేసారి చేస్తూ ఆ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇటీవల ఈ సినిమా యొక్క డబ్బింగ్ పనులు కూడా మొదలవడం విశేషం.
ఇటు నందమూరి బాలకృష్ణ కూడా వీర సింహా రెడ్డి సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని చాలా రోజులుగా భావిస్తూ వచ్చాడు. అందుకే దసరాకు ఇన్ని సినిమాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నా కూడా చక చక పనులు చేసుకుంటూ వచ్చి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే వచ్చిన అప్డేట్లను బట్టి చెప్పవచ్చు. ఇక ఈ రెండు సినిమాల్లో మాత్రమే కాకుండా సంక్రాంతికి మరో మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అయ్యాయి. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో పాటు ఇద్దరు తమిళ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. విజయ్ దళపతి నటించిన వారసుడు అజిత్ నటించిన సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *