కీర్తి సురేష్ ఆ పిచ్చి పని ఎప్పుడు చేయదు!!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ ఎన్టీఆర్ సినిమా ను రిజెక్ట్ చేసింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ అభిమానులు మాత్రం కీర్తి సురేష్ తప్పు చేసింది అన్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అంతకు ముందు త్రివిక్ర‌మ్‌తో అనుకున్న సినిమా క్యాన్సిల్ అయిపోగా.. దాని స్థానంలోకి కొర‌టాల శివ చిత్రం వ‌చ్చింది.

ఇప్పుడు ఈ సినిమా ఆ జాబితాలోకి వెళ్లేలా ఉంది. ఈ సినిమా స్క్రిప్టు ఎంత‌కీ ఓకే కాక‌పోవ‌డంతో ఇప్ప‌టిదాకా సినిమా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కి ఇంకా సమయం పడేలా ఉంది. ఇంకో రెండు మూడు నెల‌ల త‌ర్వాత అయినా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందా అన్న‌ది సందేహంగానే ఉంది.

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఈ సినిమా ను రిజెక్ట్ చేసింది అనే వార్త టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. కానీ అస‌లు విష‌యం ఏంటంటే.. ఇంకా స్క్రిప్టే ఓకే అవ్వ‌లేదు. అలాంట‌పుడు న‌టీన‌టుల ఎంపిక వ‌ర‌కు ఎందుకు వెళ్తారు? హీరోయిన్ల‌ను సంప్ర‌దించి ఎందుకు నో చెప్పించుకుంటారు? అయినా సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలియ‌న‌పుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు డేట్లు ఇస్తుంది? ఇంత చిన్న లాజిక్ తెలియ‌కుండా తార‌క్ హీరోయిన్ విష‌యంలో ఈ ర‌చ్చ ఏంట‌న్న‌ది అర్థం కాని విష‌యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *