కమల్ కి కలిసొస్తున్న టైం!!

గత కొన్ని రోజులుగా కమల్ హాసన్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించ లేకపోయాడు అని చెప్పాలి. ఎప్పుడైతే విక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అప్పటినుంచి కమల్ తన టైం మళ్ళి వచ్చినట్లుగా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తన ప్రతి సినిమాలో నటన ద్వారా ప్రేక్షకులను ఆనంద పరిచినా కూడా సినిమా ప్రేక్షకులను అలరించకపోవడంతో ఒకసారిగా ఆయన క్రేజ్ భారీ స్థాయిలో పడిపోయింది. అయితే విక్రమ్ సినిమా ఆయనకు పోయిన క్రేజ్ ను తిరిగి తీసుకువచ్చింది అని చెప్పాలి.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో అయన ప్రేక్షకులను అలరించబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాను మొదలుపెట్టిన కమల్ హాసన్ ఇప్పుడు మరొక యాక్షన్ భరితమైన సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా రోజుల తరువాత మణిరత్నం దర్శకత్వంలో మరొక సినిమాను కూడా చేయబోతున్నాడు. గతంలో రజినీకాంత్ తో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ సినిమాలను తీసిన కమలహాసన్ ఆ తరువాత రజినీకాంత్ కి తగ్గట్టుగా సినిమాలు చేయక వెనకబడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *