అసలైన ఫైట్ అంటే ఇది.. బాలయ్య వర్సెస్ చిరు!!

వచ్చే ఏడాది సంక్రాంతి కి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చిన ఈ రెండు సినిమాల మధ్య పోరు వేరే స్థాయి లో ఉంటుందని వారి వారి అభిమానులు చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమాలు సంక్రాంతి కి రావాలని ఎప్పుడు నిర్ణయించబడ్డాయి. ఆ విధంగా వీరి మధ్య ఆసక్తికర పోరు ఏర్పడింది అని చెప్పొచ్చు.

ఈ రెండు సినిమాలకు ఇప్పటినుంచి భారీ పోటీ ఏర్పడిని అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఊహించని రేంజ్ లోనే ఈ సినిమాలకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీడెడ్ ఏరియాలో కూడా మెగాస్టార్ సినిమా భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఆ ఏరియాలో వీర సింహారెడ్డి సినిమాకు దాదాపు 13 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట.మెగాస్టార్ మాత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయారు. మరి సీడెడ్ లో ఈ ఇద్దరు హీరోలలో ఎవరు అత్యధిక కలెక్షన్స్ అందుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *