అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా పడిందా!!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో మొదటగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అయితే కారణమేంటో తెలియదు కానీ ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి రావటం లేదనే వార్త  మీడియా నుంచి వినబడుతుంది.వాస్తవానికి డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు కానీ అప్పుడు కూడా ఈ సినిమా విడుదల కాదు సంక్రాంతికి పక్కాగా వస్తుందని చెప్పారు.

కానీ సంక్రాంతికి కూడా ఈ సినిమాను క్యాన్సల్ చేయడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. సురేందర్ రెడ్డి కూడా ఈ చిత్రంలోని నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు ఈ నేపద్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధానంలో ఎలాంటి పొరపాటు చేశాడో తెలియదు కానీ అది సినిమా విడుదలపై ఇంతటి ప్రభావం చూపుతుంది అని ఎవరు కూడా అనుకోలేదు. మరి అన్ని ఇబ్బందులను తొలగించుకుని ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *