అఖిల్ కూడా సంక్రాంతికే రానున్నాడా!!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందున్న సినిమా ఏజెంట్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు అఖిల్. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై అందరిలో సందిగ్దత నెలకొంది. తాజాగా రిలీజ్ మరోసారి మారినట్టుగా తెలుస్తోంది.

ముందు ఈ మూవీని 2021 డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. పాండమిక్ కరోనా థర్డ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో 2022 ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. కానీ అది జరగలేదు. ఆ తరువాత ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఆ డేట్ న కూడా ఈ మూవీ రావడం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫైనల్ గా నిర్ణయించినట్టుగా తెలిసింది. అంటే బిగ్ స్టార్లతో అఖిల్ సై అంటే సై అనబోతున్నాడన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *